News February 12, 2025
నల్గొండ: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన తల

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వివరాలిలా.. సూర్యాపేట మండలానికి చెందిన మల్లమ్మ ఆటో చెట్టుకి ఢీకొనడంతో మృతిచెందింది. HYDకి చెందిన ఇస్లాం WGL వెళ్తున్న క్రమంలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో మరణించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయి మహిళ మృతి చెందింది. ఈఘటన అడ్డగూడురులో జరిగింది. ఆమె దాచారం ZPHS పాఠశాల టీచర్ జబీన్‌గా పోలీసులు గుర్తించారు.
Similar News
News October 28, 2025
BREAKING: నిర్మల్ జిల్లాలో యాక్సిడెంట్.. యువకుడి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి గ్రామం వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 28, 2025
Way2News ‘తుఫాను’ అప్‌డేట్స్

AP: మొంథా తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులకు పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ రాత్రి తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్‌డేట్‌లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.
News October 28, 2025
నంద్యాల: ‘అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు’

నంద్యాల జిల్లాకు మొంథా తుఫాన్ ప్రభావం వలన ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను ప్రమాదాలబారీన పడకుండా అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా SP సునీల్ షెరాన్ తెలిపారు. రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి సురక్షితమైన ప్రాంతాల్లో నిలుపుకోవాలన్నారు. ఎవరైనా ప్రమాదంలో ఉంటే 112కు ఫోన్ చేయాలన్నారు.


