News February 12, 2025
సంగారెడ్డి: టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739330673421_1243-normal-WIFI.webp)
పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నచింతకుంట గ్రామానికి చెందిన విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2025
BREAKING: అకౌంట్లో డబ్బుల జమ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738540471430_893-normal-WIFI.webp)
TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపింది. జనవరి 26న ఈ పథకం కింద ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే.
News February 12, 2025
విజయవాడ: రెండు రోజులు ఆ రైలు రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739348466774_51824121-normal-WIFI.webp)
గూడూరు- విజయవాడ మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నందున విజయవాడ- తెనాలి మధ్య ప్రయాణించే మెము రైలును రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.67221 విజయవాడ- తెనాలి మెము రైలును బుధ, గురువారాలు రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
News February 12, 2025
కొత్తూరు జెపి దర్గాను సందర్శించిన హీరో విశ్వక్ సేన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739353330702_774-normal-WIFI.webp)
ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను సినీ హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. త్వరలో విడుదల కానున్న మూవీ ‘లైలా’ విజయవంతం కావాలని కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి ఈ దర్గాకు వస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయానని ఇప్పుడు లైలా విడుదల సందర్భంగా వచ్చినట్లు చెప్పారు.