News February 12, 2025
భూపాలపల్లి: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికారులు

భూపాలపల్లి జిల్లాలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయన్న సంకేతాలతో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మూడు మండలాల చొప్పున గ్రామపంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసేలా సమాయత్తం అవుతున్నారు.
Similar News
News November 17, 2025
కర్నూలు: కేంద్ర మంత్రి మనోహర్ లాల్‌కు ఘన స్వాగతం

కర్నూలు జిల్లా పర్యటన నిమిత్తం కేంద్ర విద్యుత్, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ సోమవారం విచ్చేశారు. ఓర్వకల్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రి గెస్ట్ హౌస్‌కు చేరుకొని జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కర్నూల్ ఎస్పీ PGRSకు 84 ఫిర్యాదులు

కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులపై విచారణ చేసి, చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.