News February 12, 2025
KMM: 10th అర్హతతో 51 GOVT జాబ్స్

ఖమ్మం డివిజన్‌లో 48 GDS, 3 డాక్ సేవక్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. SHARE IT
Similar News
News November 6, 2025
టేకులపల్లి ఐటీఐలో నవంబర్ 7న జాబ్ మేళా

భారత్ హ్యుండాయ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 24 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. డిగ్రీ అర్హతతో సేల్స్ కన్సల్టెంట్స్ (రూ.18,000), డీజిల్ మెకానిక్ లేదా బిటెక్ అర్హతతో సర్వీస్ అడ్వయిజరీ (రూ.12,000) పోస్టులు ఉన్నాయని చెప్పారు.
News November 5, 2025
చేప పిల్లల పంపిణీ పక్కాగా జరగాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీజ

ఖమ్మం జిల్లాలో చేప పిల్లల పంపిణీ, విడుదల పక్కాగా జరగాలని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ డా. పి. శ్రీజ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 882 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందన్నారు. నవంబర్ 6 నాటికి మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్యం ఉన్న చెరువుల్లో చేప పిల్లలు వేయవద్దని, వివరాలను టీ-మత్స్య యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.
News November 4, 2025
పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ శ్రీజ

రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. విద్యార్థుల హాజరు శాతంపై దృష్టి సారించాలని, వెనుకబడిన వారికి అదనపు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. హాజరు శాతం 90కి పైగా ఉండేలా తల్లిదండ్రులతో నిరంతరం ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు.


