News February 12, 2025
MBNR: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

లక్ష్మీనారాయణ కంపౌండ్‌లో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. జడ్చర్ల మండలం జయప్రకాశ్‌నగర్‌కు చెందిన శంకర్(33) ఇంటి నుంచి మేస్త్రీ పనికోసం బయలుదేరాడు. ఎప్పుడు.. ఎలా.. ఏం జరిగిందో తెలియదుకాని కాంపౌండ్ వద్ద రోడ్డుపై పడి మృతిచెందాడు. మృతుడికి మూర్ఛ వచ్చేదని, మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదైంది.
Similar News
News February 23, 2026
ASF: కలెక్టరేట్‌లో సెల్ టవర్ ఏర్పటుపై సమీక్ష

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం ASF కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, అటవీ అధికారులు, బీఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్, జియో, టీ ఫైబర్ ప్రతినిధులతో సెల్ టవర్ నిర్మాణాలు, ఇంటర్నెట్ సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని అనుమతులు, స్థలాల గుర్తింపు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
News February 23, 2026
విశాఖ: 63వ సారి రక్తదానం చేసి.. మానవతను చాటారు

విశాఖ స్టీల్ ప్లాంట్ జనరల్ ఫోర్‌మాన్ కె.వి.ఎల్.ఎన్.రెడ్డి 63వసారి రక్తదానం చేసి మానవతను చాటారు. రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్న 9 ఏళ్ల రమ్యత అచ్యుతకు అత్యవసరంగా అవసరమైన సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్(SDP)ను అగనంపూడి హోమి బాబా ఆసుపత్రిలో దానం చేశారు. ప్లేట్లెట్ కౌంట్ 10 వేలకు పడిపోవడంతో వెంటనే స్పందించారు. B+ గ్రూప్‌నకు చెందిన రెడ్డి రెండోసారి SDP దానం చేయడంతో సహోద్యోగులు అభినందించారు.
News February 23, 2026
TGPSC వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు

TG: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునే గడువును మార్చి 25కు పొడిగిస్తున్నట్లు TGPSC ప్రకటించింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ <


