News February 12, 2025
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకుడు కన్నుమూత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739333628974_367-normal-WIFI.webp)
అయోధ్య రామమందిర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. స్ట్రోక్ రావడంతో ఆదివారం లక్నోలోని ఆస్పత్రికి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. సత్యేంద్ర దాస్ డయాబెటిస్, హై బీపీతోనూ బాధపడుతున్నారు. 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేతకు ముందు నుంచే ఈయన రామమందిర అర్చకుడిగా ఉన్నారు.
Similar News
News February 12, 2025
ఉచితాలపై సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738567372276_893-normal-WIFI.webp)
ఎన్నికల్లో ఉచిత హామీలు ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రజలు పనిచేయడానికి ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించింది. డబ్బు, ఆహారం రావడంతో ఏ పని చేయడానికీ ఇష్టపడట్లేదని పేర్కొంది. పనిచేయకుండానే డబ్బులు వస్తుండటంతో ఇలా జరుగుతుందని తెలిపింది. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే పిటిషన్‌పై విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
News February 12, 2025
ఆ సమయంలో అన్నీ ఆత్మహత్య ఆలోచనలే: దీపికా పదుకొణె
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739342546087_1226-normal-WIFI.webp)
నటి దీపికా పదుకొణె ‘పరీక్షా పే చర్చ’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువు, క్రీడలు, మోడలింగ్ తర్వాత యాక్టింగ్.. ఇలా జీవితంలో ఎన్నో మార్పులు చూసినట్లు తెలిపారు. 2014 తర్వాత జీవితంలో సమస్యలతో కుంగుబాటుకు గురైనట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని తెలిపారు. సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న ఈ అమ్మడు రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకొని ఇటీవల ఓ బిడ్డకు తల్లయ్యారు.
News February 12, 2025
ఎన్నికల్లో అభ్యర్థిగా ‘నోటా’.. ఓట్లు ఎక్కువ వస్తే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739345679595_1226-normal-WIFI.webp)
TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాన్ని అడ్డుకునేందుకు నోటాను అభ్యర్థిగా చేర్చాలని EC సన్నాహాలు చేస్తోంది. MH, హరియాణా వంటి రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించే అవకాశముంది. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి రీ ఎలక్షన్స్‌లో పోటీ చేసే అర్హత లేదు. ఇందులోనూ నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.