News February 12, 2025
NGKL: అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739333709735_1292-normal-WIFI.webp)
అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడూర్ మండల కేంద్రంలో నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన ఉప్పరి చిన్నయ్య (40) అప్పుల బాధ భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై కేసు నమోదు కాలేదు.
Similar News
News February 12, 2025
రాష్ట్రస్థాయి పోటీల విజేతగా నిర్మల్ బిడ్డ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739353634206_51893698-normal-WIFI.webp)
HYDలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో నిర్మల్ పట్టణానికి చెందిన అనుముల శ్రీవైభవి రాణించింది. అండర్ 13 విభాగంలో రాష్ట్రస్థాయి సింగిల్స్, డబుల్స్‌లో విజేతగా నిలిచింది. మెడల్స్ సాధించిన శ్రీవైభవిని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ రాణి అభినందించారు.
News February 12, 2025
కామారెడ్డి: క్వింటాకు రూ.7550 చెల్లిస్తాం: మార్కోఫెడ్ జిల్లా మేనేజర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739352584238_50226745-normal-WIFI.webp)
కందులు క్వింటాకు మద్దతు ధర రూ.7,550 చెల్లిస్తామని మార్కోఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 56,189 ఎకరాల్లో కంది పంటను సాగు చేయడంతో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, బోర్లం, తాడ్వాయి, గాంధారి, పద్మాజీవాడి వద్ద కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 12, 2025
ఏపీ కోళ్లను అనుమతించొద్దు: అడిషనల్ ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739349442160_51748643-normal-WIFI.webp)
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ముదిగొండ మండలం వల్లభి చెక్ పోస్ట్ వద్ద వచ్చే కోళ్ల వాహనాలను అనుమతించొద్దని అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావు తెలిపారు. సీఐ మురళి, తహశీల్దార్ సునీత ఎలిజబెత్, పశు వైద్యాధికారులు అశోక్, రమేష్ బాబు, వైద్య అధికారి ధర్మేంద్ర, ఆర్ఐ ప్రసన్నకుమార్‌తో కలిసి వల్లభి చెక్ పోస్టు వద్ద ఆయన తనిఖీలు చేశారు. ఏపీ నుంచి వచ్చే కోళ్లను, ఇసుకను అనుమతించొద్దని సిబ్బందికి పలు సూచనలు చేశారు.