News February 12, 2025
2కె పరుగును ప్రారంభించిన వరంగల్ సీపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739333883210_50199223-normal-WIFI.webp)
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్(టీఎస్ జేయూ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కె పరుగును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రారంభించారు. నగర ప్రముఖులు, విద్యార్థులు, వైద్య విద్యార్థులు పాల్గొన్న ఈ పరుగు ఈరోజు ఉదయం వరంగల్ పోచమ్మ మైదానం నుంచి ప్రారంభమై కాకతీయ వైద్య కళాశాల వద్ద ముగిసింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
Similar News
News February 12, 2025
శామీర్‌పేట్‌లో యాక్సిడెంట్.. యువతి మృతి (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355116556_705-normal-WIFI.webp)
శామీర్‌పేట్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యి చికిత్స పొందుతున్న యువతి భవాని మంగళవారం అర్ధరాత్రి మృతి చెందింది. సోమవారం రెడీమిక్స్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు కాగా వెంటనే కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు వైద్యచికిత్సల నిమిత్తం రూ.రెండున్నర లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
News February 12, 2025
ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. సిఫీకి లోకేశ్ ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739353277320_1045-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సిఫీ టెక్నాలజీస్ ఎండీ రాజు వేగేశ్నను మంత్రి నారా లోకేశ్ కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజుతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వివరించారు. ఏపీలో పెట్టుబడికి తాము సుముఖంగా ఉన్నట్లు రాజు లోకేశ్‌కు తెలిపారు.
News February 12, 2025
కొత్తూరు జెపి దర్గాను సందర్శించిన హీరో విశ్వక్ సేన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739354648401_774-normal-WIFI.webp)
ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను సినీ హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. త్వరలో విడుదల కానున్న మూవీ ‘లైలా’ విజయవంతం కావాలని కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి ఈ దర్గాకు వస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయానని ఇప్పుడు లైలా విడుదల సందర్భంగా వచ్చినట్లు చెప్పారు.