News February 12, 2025
Stock Markets: కుప్పకూలాయి..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734703367305_1124-normal-WIFI.webp)
స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 22,862 (-209), సెన్సెక్స్ 75,570 (-730) వద్ద ట్రేడవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావంతో గ్లోబల్ సప్లయి చైన్ దెబ్బతింటుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్ముతున్నారు. ఇండియా విక్స్ 2.75% పెరిగి 15.28కి చేరుకుంది. IT షేర్లు రాణిస్తున్నాయి. మీడియా, రియాల్టి, బ్యాంకు, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి.
Similar News
News February 12, 2025
Stock Markets: లాభాలు నిలబెట్టుకోలేదు..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738644358848_1199-normal-WIFI.webp)
బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,045 (-26), సెన్సెక్స్ 76,171 (-122) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 200, సెన్సెక్స్ 600 Pts మేర నష్టపోయి మళ్లీ పుంజుకోవడం గమనార్హం. PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G సూచీలు ఎరుపెక్కాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.
News February 12, 2025
శుభ్‌మన్ గిల్ ‘శతక’బాదుడు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739354607046_1045-normal-WIFI.webp)
భారత స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో సెంచరీతో కదం తొక్కారు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది ఆయనకు 7వ వన్డే సెంచరీ. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో గిల్ 87, 60 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. కాగా.. భారత్ స్కోరు ప్రస్తుతం 206/2గా ఉంది. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ 43(36 బంతుల్లో) కూడా ధాటిగా ఆడుతున్నారు.
News February 12, 2025
ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. సిఫీకి లోకేశ్ ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739353277320_1045-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సిఫీ టెక్నాలజీస్ ఎండీ రాజు వేగేశ్నను మంత్రి నారా లోకేశ్ కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజుతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వివరించారు. ఏపీలో పెట్టుబడికి తాము సుముఖంగా ఉన్నట్లు రాజు లోకేశ్‌కు తెలిపారు.