News February 12, 2025

బి.కొత్తకోట: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి

image

భార్య కాపురానికి రాలేదని విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు. బి.కొత్తకోటకు చెందిన పోతుగాల్ల శేఖర్ (35) భార్య గంగాదేవి అలిగి పుట్టినిల్లు, పాత మొలకలచెరువుకు వచ్చేసిందన్నారు. భార్యను కాపురానికి రావాలని ఈనెల 8న వెళ్లి పిలవడంతో ఆమె నిరాకరించడంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడని ఎస్సై తెలిపారు. అతన్ని మదనపల్లి నుంచి తిరుపతి రుయాకు తరలించగా మృతి చెందాడు.

Similar News

News September 18, 2025

HYD: క్షీణించిన అశోక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

image

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేస్తుండగా ఆరోగ్యంగా క్షీణించింది. దీంతో ఆయనను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లుగా బృందాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు.

News September 18, 2025

NZB: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో వృద్ధురాలి శవం

image

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.