News February 12, 2025

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

image

AP: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివ దీక్షాపరులకు ఈ నెల 19 నుంచి 23 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News February 12, 2025

అదరగొడుతున్న గిల్.. కోహ్లీ ఫిఫ్టీ

image

భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదరగొడుతున్నారు. వరుసగా మూడు వన్డేల్లో 50+ స్కోర్ చేశారు. తొలి వన్డేలో 87, రెండో వన్డేలో 60 పరుగులు చేశారు. మూడో వన్డేలోనూ అర్ధసెంచరీతో కొనసాగుతున్నారు. మరోవైపు పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న కింగ్ కోహ్లీ(52) ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యారు.

News February 12, 2025

రేపు పార్లమెంట్ ముందుకు ట్యాక్స్ బిల్లు

image

రేపు పార్లమెంట్‌లో కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 622 పేజీలతో బిల్లును రూపొందించినట్లు సమాచారం. 1961 నుంచి ఉన్న పాత బిల్లుకు స్వస్తి పలకనున్న కేంద్రం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ బిల్లును అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా ట్యాక్స్ విధానం సులభతరం కానుందని కేంద్రం తెలిపింది.

News February 12, 2025

‘తండేల్’ కలెక్షన్ల ప్రభంజనం

image

థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.80.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. వాలంటైన్స్ వీక్‌లో బ్లాక్ బస్టర్ తండేల్‌పై ప్రేమ అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతుందని పేర్కొంది. నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి.

error: Content is protected !!