News February 12, 2025
వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News September 19, 2025
పట్టాభిరాముని ఆలయాభివృద్ధికి చర్యలు: TTD

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయాభివృద్ధికి TTD చర్యలు చేపట్టింది. ఆలయ పుష్కరిణి, కళ్యాణ వేదిక మండపం, రాజగోపురం, ఆర్చి, కళ్యాణ మండపం తదితర పనులకు రూ.5.73 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పుష్కరిణి పునఃనిర్మాణానికి రూ.1.50 కోట్లతో పనులు చేపట్టేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది.
News September 19, 2025
కోకాపేట్‌లో భర్తను చంపిన భార్య

కోకాపేట్‌లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.
News September 19, 2025
బాపట్ల: రాజస్థాన్‌లో మన జవాన్ మృతి

బాపట్ల(M) వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన జవాన్ మేడిబోయిన దుర్గారెడ్డి రాజస్థాన్‌లో మృతి చెందినట్లు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాంబశివరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజస్థాన్ నుంచి మృతదేహం అంబులెన్స్‌లో శనివారం స్వగ్రామానికి రానుందని చెప్పారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.