News February 12, 2025
బర్డ్ ఫ్లూ అంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739326103736_782-normal-WIFI.webp)
బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఫ్లూ) పక్షుల్లో H5N1 వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది 1996లో చైనాలో ఉద్భవించింది. వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 954 మందికి సోకగా, 464మంది మరణించారు. ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.
Similar News
News February 12, 2025
రేపు పార్లమెంట్ ముందుకు ట్యాక్స్ బిల్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355392323_81-normal-WIFI.webp)
రేపు పార్లమెంట్‌లో కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. 536 సెక్షన్లు, 23 చాప్టర్లు, 622 పేజీలతో బిల్లును రూపొందించినట్లు సమాచారం. 1961 నుంచి ఉన్న పాత బిల్లుకు స్వస్తి పలకనున్న కేంద్రం, ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ బిల్లును అమల్లోకి తీసుకురానుంది. దీని ద్వారా ట్యాక్స్ విధానం సులభతరం కానుందని కేంద్రం తెలిపింది.
News February 12, 2025
‘తండేల్’ కలెక్షన్ల ప్రభంజనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350222467_1226-normal-WIFI.webp)
థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.80.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. వాలంటైన్స్ వీక్‌లో బ్లాక్ బస్టర్ తండేల్‌పై ప్రేమ అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతుందని పేర్కొంది. నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి.
News February 12, 2025
ఇక్ష్వాకు వంశంపై హరగోపాల్ ఏమన్నారంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739349436481_746-normal-WIFI.webp)
ఇక్ష్వాకుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. పురాణాల ప్రకారం రాముడిది ఇక్ష్వాకు వంశం. అలాగే, తెలుగునాట కూడా ఈ పేరుతో ఓ రాజవంశం ఉండేది. శాతవాహనుల తరువాత పాలించింది ఆంధ్ర ఇక్ష్వాకులు. ‘ఏ కులం వారైనా ఇక్ష్వాకులు అని చెప్పడానికి ఏ ఆధారమూ లేదు. ఈ వంశం ఇప్పటి వరకూ కొనసాగి, ఎవరో ఒకరు ఇంకా ఉన్నారని చెప్పే అవకాశం లేదు. ఎవరైనా చెప్పుకున్నా దానికి సాక్ష్యం ఉండదు’ అని ప్రొఫెసర్ హరగోపాల్ చెబుతున్నారు.