News March 20, 2024
హసరంగ కోసం శ్రీలంక మాస్టర్ ప్లాన్..?

అంపైర్లతో దురుసు ప్రవర్తన కారణంగా శ్రీలంక స్పిన్నర్ హసరంగపై ఐసీసీ రెండు మ్యాచుల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాతో వన్డే సిరీస్ అనంతరం అతడు ఆడే 2 టెస్టులు లేదా 4 వన్డేలు/టీ20 మ్యాచులపై నిషేధం అమలవ్వాల్సి ఉంది. బంగ్లాతో టెస్టుల తర్వాత శ్రీలంక ఆడేది టీ20 వరల్డ్ కప్‌లోనే. దీంతో ఆ సమయంలో బ్యాన్ అవకుండా.. శ్రీలంక బోర్డు తెలివిగా టెస్టులకు అతడిని ఎంపిక చేసిందన్న వాదన నెట్టింట వినిపిస్తోంది.
Similar News
News November 7, 2025
తాజా సినీ ముచ్చట్లు

☛ 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్(ఫీచర్ ఫిల్మ్)గా ‘కమిటీ కుర్రాళ్లు’ డైరెక్టర్ యధు వంశీ నామినేట్
☛ DEC 25న థియేటర్లలోకి మోహన్‌లాల్ ‘వృషభ’ మూవీ
☛ ‘కథనార్-ది వైల్డ్ సోర్సెరర్’ మూవీ నుంచి అనుష్క శెట్టి లుక్ రివీల్. రోజిన్ థామస్ దర్శకుడు. ప్రధాన పాత్రలో మలయాళ నటుడు జయసూర్య
☛ TV యాడ్ కోసం సచిన్ టెండూల్కర్‌ను డైరెక్ట్ చేసిన ‘OG’ డైరెక్టర్ సుజీత్
News November 7, 2025
పెళ్లి ఏర్పాట్లలో రష్మిక!

విజయ్ దేవరకొండతో రష్మిక మంధాన వచ్చే ఏడాది వివాహ <<18217983>>బంధంలోకి <<>>అడుగు పెట్టనున్నట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఫేమస్ వెడ్డింగ్ డెస్టినేషన్ జైపూర్(రాజస్థాన్)లో పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సరైన వేదిక కోసం రష్మిక 3 రోజులు అక్కడ పర్యటించినట్లు తెలుస్తోంది. జైపూర్‌లోని పలు రిసార్టులను పరిశీలించారని టాక్. త్వరలోనే వేదికను ఖరారు చేయనున్నట్లు సినీ వర్గాల ప్రచారం.
News November 7, 2025
అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం

AP: నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(NaBFID) అమరావతి నిర్మాణానికి ₹7,500 CR రుణం మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ సమక్షంలో CRDA కమిషనర్ కన్నబాబుకు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సామ్యూల్ జోసెఫ్ అందించారు.


