News February 12, 2025
వరంగల్ మార్కెట్లో భారీగా పతనమైన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు పత్తి ధర భారీగా పతనమైంది. నిన్న మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. నేడు రూ.6,950కి పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. ఒకరోజు వ్యవధిలోనే రూ.110 ధర తగ్గడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 6, 2025
BBL: ఆ బంతులు ప్రేక్షకులకే!

ఆస్ట్రేలియాలో జరిగే BBL, WBBL టోర్నీల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. బ్యాటర్ 6 లేదా 4 కొట్టిన బంతి ప్రేక్షకుల వద్దకు వెళితే దాన్ని వాళ్లు తీసుకెళ్లొచ్చు. అయితే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌కే ఇది వర్తిస్తుంది. ఆ ఓవర్‌లో ఎన్నిసార్లు కొట్టినా సరే బంతిని మారుస్తారు. మరోవైపు బాల్‌ను ప్రేక్షకులు తీసుకోకపోయినా రెండో ఓవర్ నుంచి కొత్తది వాడనున్నారు. ఆలస్యం జరగకుండా అంపైర్లు తమ వద్ద కొన్ని ఉంచుకోనున్నారు.
News November 6, 2025
ఊట్కూర్: నేల మట్టమైన వరి పంట

ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల కారణంగా ఊట్కూరు మండల కేంద్రంలోని పెద్ద జెట్రం అమ్మనికి చెందిన రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శివారులో వేసిన వరి పొలాలు నీట మునిగి సుమారు 50 ఎకరాల వరి పంట నష్టం చేతికొచ్చిన పంటలు నీటి పాలవడంతో అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. పంట నష్టాన్ని అధికారులు వెంటనే అంచనా వేసి రైతులను ఆదుకోవాలని మాజీ MPTC కిరణ్ డిమాండ్ చేశారు.
News November 6, 2025
IMMTలో 30 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(<


