News February 12, 2025

కొల్లిపరలో భారీ కొండ చిలువ 

image

కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో బుధవారం భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు ఆదాము ఉదయం పనుల నిమిత్తం పొలానికి వెళ్లాడు. ఈ సమయంలో నిమ్మతోటలో భారీ కొండ చిలువ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊర్లోకి వెళ్లి గ్రామస్థులను తీసుకువచ్చి కొండ చిలువను పట్టుకొని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వదిలారు. తరచూ గ్రామంలో, పొలాల్లో కొండ చిలువలు కనిపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. 

Similar News

News January 19, 2026

అమరావతి రైతులకు ఒకే చోట ప్లాట్లు

image

అమరావతి భూసేకరణ రెండో దశలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 20,494 ఎకరాల సేకరణలో భాగంగా రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను ఒకే చోట కేటాయించనున్నారు. గతంలోలా వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా, ఒకే క్లస్టర్‌లో వీటిని ఇవ్వనున్నారు. ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పనులు వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల రైతులకు త్వరగా ప్లాట్లు అప్పగించే వీలుంటుందని అధికారులు తెలిపారు.

News January 19, 2026

గణతంత్ర వేడుకలకు సిద్దం కావాలి: కలెక్టర్

image

గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. 77వ గణతంత్ర వేడుకల పై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు తుళ్లూరు మండలం రాయిపూడిలో జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని ఆదేశించారు. సీఆర్డీఏ, శాఖల ప్రధాన కార్యాలయాలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.

News January 19, 2026

GNT: ఈ-క్రాప్‌కు కొత్త నిబంధనలు.. రైతులకు ఊరట

image

గుంటూరు జిల్లాలో రైతులకు అందే ప్రభుత్వ ప్రయోజనాలకు ఈ-క్రాప్ కీలకంగా మారింది. గత ప్రభుత్వంలో నమోదు సరిగా కాక చాలామంది రైతులు నష్టపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ-క్రాప్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రబీ నుంచి కొత్త మార్గదర్శకాలు అమలు చేస్తోంది. రైతు సమక్షంలోనే పొలంలో నమోదు చేయాలని ఆదేశించింది. సాగు భూమితో పాటు ఖాళీ భూములను కూడా ల్యాండ్ పార్శిల్‌గా నమోదు చేస్తున్నారు.