News February 12, 2025

HYDలో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు..!

image

HYD,SECలో 31 GDS, 68 డాక్ సేవక్ పోస్టులకు indiapostgdsonline.gov.inవెబ్‌సైట్లో తపాలాశాఖ నోటిఫికేషన్ విడుదలైంది. HYD SORTING- డాక్ సేవక్ 27, HYD సౌత్ ఈస్ట్-డాక్ 22, GDS 19, HYD సిటీ- డాక్‌సేవక్ -7, సికింద్రాబాద్-డాక్‌సేవక్ 12, GDS-12 ఉన్నాయి. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40 మధ్య ఉండాలి. సైకిల్,బైక్ నడపగలగాలి. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100, మిగిలిన వారికి ఉచితం.

Similar News

News November 12, 2025

విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

image

H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటమార్చారు. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.

News November 12, 2025

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

image

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<>TISS<<>>) 2 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBDలకు రూ.125. వెబ్‌సైట్: https://tiss.ac.in

News November 12, 2025

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

image

నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పరిశీలించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో 255 కేంద్రాలు ఏర్పాటు చేశామని, సెంటర్లలో అన్ని వసతులు సౌకర్యం కల్పించామన్నారు.