News February 12, 2025
MBNR: రెండు రోజులకు శవమై తేలింది!

ఇంట్లో గొడవపడి బయటికెళ్లిపోయిన మహిళ శవమై తేలిన ఘటన గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. పగిడ్యాల్‌కి చెందిన పద్మమ్మ(38) ఆదివారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు అలిగి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంతవెతికినా ఆమె జాడ కనిపించలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత పగిడ్యాల్ మల్లమ్మచెరువులో శవమై తేలింది. పద్మమ్మకు భర్త, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదైంది.
Similar News
News September 15, 2025
శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా పోలీసుల వాహన తనిఖీలు

శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాలతో సోమవారం సాయంత్రం పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించగా హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి అని అవగాహన కల్పిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
News September 15, 2025
BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి.
News September 15, 2025
ఆసిఫాబాద్: వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం, బనార్వాడకు చెందిన చిచోల్కార్ సుధాకర్ (66) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 2న తన టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరిన సుధాకర్, సాయంత్రమైనా తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.