News February 12, 2025
లావణ్యతో నార్సింగి డీఐ శ్రీనివాస్ వీడియో కాల్స్..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739337591736_50531113-normal-WIFI.webp)
నార్సింగ్ డీఐ శ్రీనివాస్‌ను ఐజీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీచేశారు. రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి లావణ్యతో తరచూ వాట్సాప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుతూ.. పరిచయం పెంచుకోవడం వీరిద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.
Similar News
News February 12, 2025
కొత్తూరు: దర్గాను దర్శించుకున్న హీరో విశ్వక్ సేన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350795917_1212-normal-WIFI.webp)
HYD శివారు షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరులోని జేపీ దర్గాను ప్రముఖ సినీ హీరో విశ్వక్‌సేన్ దర్శించుకున్నారు. త్వరలో విడుదల కానున్న తన సినిమా లైలా హిట్ కావాలని కుటుంబసభ్యులతో కలిసి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి దర్గాకు వస్తుండే వాడినని, ఈ మధ్యకాలంలో రాలేకపోయానన్నారు.
News February 12, 2025
HYD: కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది: కునంనేని
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739341418796_52296546-normal-WIFI.webp)
కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ముగ్ధూం భవన్‌లో ఆయన మాట్లాడుతూ..‘కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది. ప్రజా ప్రతినిధులు ఫోన్‌లు ఎత్తడం లేదు. సిస్టం ఫాలో అవడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసొస్తే పోటీ చేస్తాం. లేకపోతే బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం’ అన్నారు.
News February 12, 2025
రేషన్ కార్డ్‌లపై అదనపుఛార్జి వసూలు చేస్తే కాల్ చేయండి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739339076092_14171425-normal-WIFI.webp)
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు వచ్చే పేద ప్రజలు మీ సేవ కేంద్రంలో ఆన్‌లైన్ సేవల రుసుము ₹45 మాత్రమే చెల్లించాలి. రసీదుపై ప్రింటైన రుసుమ కంటే నయా పైసా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు అని తెలిపారు. అదనంగా వసూలు చేస్తే 040-45676699 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.