News February 12, 2025

కావలి మనీ స్కాం వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

image

కావలి కేంద్రంగా స్టాక్ మార్కెట్ పేరుతో జరిగిన భారీ మనీ స్కాం వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుల్ పాత్ర ఉండటంతో సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదేశాలు జారీ చేశారు. మనీ స్కాంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఉన్నతాధికారుల విచారణ అనంతరం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రాధాకృష్ణ, జ్యోతి అయోధ్య కుమార్ లను సస్పెండ్ చేశారు.

Similar News

News April 23, 2025

నెల్లూరు: రియల్ ఎస్టేట్ వెంచర్లపై ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లాలో అనుమతి లేని రియల్ ఎస్టేట్ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ గౌడ్ కోరారు. నెల్లూరు కలెక్టరేట్‌లో డీఆర్వో ఉదయభాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తున్నారన్నారు. బోగస్ ప్రకటనతో ప్రజలను మోసం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

News April 23, 2025

టెన్త్ ఫలితాలు.. 13వ స్థానానికి చేరుకున్న నెల్లూరు జిల్లా

image

నెల్లూరు జిల్లాలో టెన్త్ ఫలితాలు గతేడాదితో పోల్చితే ఆశాజనకంగా నమోదయ్యాయి. గతేడాది 88.17% ఉత్తీర్ణతతో 15 స్థానంలో జిల్లా నిలవగా.. తాజాగా 83.58 శాతం ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,633 మంది పాస్ అయ్యారు.

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో 13వ స్థానంలో నెల్లూరు జిల్లా

image

టెన్త్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా 13వ స్థానంలో నిలించింది. మొత్తం 28,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 23,633 మంది పాస్ అయ్యారు. 14,142 మంది అబ్బాయిలకుగాను 11,510 మంది, అమ్మాయిలు 14,133 మందికిగాను 12,123 మంది పాస్ అయ్యారు. కాగా 83.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

error: Content is protected !!