News February 12, 2025
సరూర్ నగర్: రేపు కబడ్డీ జట్ల ఎంపిక
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739322662405_51765059-normal-WIFI.webp)
రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు రేపు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గం.కు ఎంపిక ఉంటుందని, 16 ఏళ్లలోపు బాల బాలికలు ఆధార్ కార్డుతో ఎంపికకు హాజరు కావాలన్నారు. ఎంపికైన వారు వికారాబాద్ జిల్లాలో జరిగే 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా పోటీల్లో ఆడుతారన్నారు.
Similar News
News February 12, 2025
ఈనెల 15న ఆటో డ్రైవర్ల రాష్ట్రవ్యాప్త ఆందోళన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739361820483_653-normal-WIFI.webp)
TG: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు ఆటో డ్రైవర్స్ ఐకాస ప్రకటించింది. కార్మికులకు నెలకు రూ.12వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని ఐకాస కన్వీనర్ వెంకటేశం తెలిపారు. సమ్మెకు పిలుపునిస్తే మంత్రి పొన్నం ఇంటికి పిలిపించి మాట్లాడారని, కానీ 4 నెలలైనా పరిష్కారం చూపలేదని వాపోయారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రూ.10వేల Cr విడుదల చేయాలన్నారు.
News February 12, 2025
MBNR: ఇద్దరు ఎస్‌ఐల బదిలీ: డీఐజీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739352161559_51916297-normal-WIFI.webp)
జోగులాంబ గద్వాల జోన్-7 పరిధిలో ఇద్దరు ఎస్‌ఐలను బదిలీ చేసినట్టు డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ తెలిపారు. రాజాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కేతావత్ రవిని మహబూబ్ నగర్ వీఆర్‌కు బదిలీ చేయగా, జడ్చర్ల PS ఎస్సై శివానందంను రాజాపూర్ పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేశారు. ఈమేరకు డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
News February 12, 2025
పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అసహనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739353645527_50031802-normal-WIFI.webp)
కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ తన హక్కును కోరడాన్ని చిన్నచూపుగా అభివర్ణించడం బాధాకరమని మంత్రి అన్నారు. దేశానికి భారీగా ఆదాయం అందిస్తున్న తెలంగాణకు తగిన న్యాయం జరగాలని కోరడం న్యాయమేనని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గుర్తించి, వాటి అభివృద్ధికి కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.