News February 12, 2025
కాగజ్‌నగర్: అనుమానంతో యువకుడిపై దాడి

పట్టణంలోని ద్వారకా నగర్‌కు చెందిన అక్రమ్ ఖాన్ పై మంగళవారం రాత్రి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాదారులు దాడికి పాల్పడ్డారు. చిన్న మసీద్ సమీపంలో ఉన్న అతడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి చితకబాదారు. మంగళవారం పోలీసులు 208 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆ బియ్యాన్ని అక్రమ్ ఖాన్ పట్టించాడనే అనుమానంతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News November 9, 2025
సినిమా అప్డేట్స్

* అనుకోని కారణాలతో ఆగిపోయిన జులన్ గోస్వామి బయోపిక్ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ను(అనుష్క శర్మ లీడ్ రోల్) విడుదల చేయడానికి మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చిస్తున్నారు.
* వాల్ట్ డిస్నీ నిర్మించిన ‘జూటోపియా’ మూవీకి హిందీలో జూడీ హోప్స్ పాత్రకు శ్రద్ధా కపూర్ వాయిస్ ఇస్తున్నారు. ఈ మూవీ NOV 28న రిలీజవనుంది.
* దళపతి విజయ్ నటించిన ‘జన నాయకుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ మూవీ JAN 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News November 9, 2025
పిట్లం: బువ్వ విలువ తెలిసిన అవ్వ..!

వరి కోతలు చివరి దశకు చేరుకోవడంతో, రైతులు కోసిన ధాన్యాన్ని రోడ్లపై రాశులుగా ఆరబెట్టారు. ఈ ధాన్యం ఎండిన తరువాత రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో, బువ్వ విలువ తెలిసిన కొందరు వృద్ధ మహిళలు రోడ్లపై పడివున్న ధాన్యపు గింజలను వృథా చేయకుండా సేకరించారు. రాళ్లు లేకుండా శుభ్రం చేసి జాగ్రత్తగా సంచుల్లో నింపుకున్నారు. పిట్లం జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై శనివారం కనిపించిన దృశ్యమిది.
News November 9, 2025
ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

సీఎం చంద్రబాబు ఈనెల 11న ప్రకాశం జిల్లాకు రానున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలుకు రావద్దని సూచించారు.


