News February 12, 2025

HYD వితౌట్ ఇంటర్నెట్..! మీ కామెంట్

image

HYDలో ఒక్కసారి ఇంటర్ నెట్ ఆగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతం పెరిగిన డిజిటలైజేషన్ మేరకు దేశ, విదేశాల నుంచి వచ్చి HYD కేంద్రంగా చేస్తున్న ప్రతి ఉద్యోగానికి ఇంటర్‌నెట్ ముడిపడి ఉంది. అసలు ఇంటర్‌నెట్ లేనిదే పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఊహించండి HYD వితౌట్ ఇంటర్నెట్ అంటూ..Xలో పలువురు వేలాది పోస్టులు చేస్తున్నారు. అది అసాధ్యం అని కొందరు, బతకలేం అని ఇంకొందరు అంటున్నారు.

Similar News

News February 12, 2025

PHOTO OF THE DAY

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కొచ్చిలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో పవన్‌తో పాటు ఆయన కుమారుడు అకీరానందన్ కూడా ఉండటం విశేషం. తండ్రీకొడుకులు ఇద్దరూ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చి నమస్కరిస్తున్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఫొటో ఆఫ్ ది డే అంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.

News February 12, 2025

మొన్న 90 గంటల పని, భార్యనెంత సేపు చూస్తారు.. నేడు మరో వివాదం

image

వారానికి 90Hrs పని, భార్యను ఎంతసేపు చూస్తారన్న L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదానికి తెరతీశారు. టెకీస్ సహా భారత శ్రామికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడరని, పరిశ్రమలకు సవాళ్లు సృష్టిస్తారని చెప్పారు. ‘నేను జాయిన్ కాగానే నాది చెన్నై అయితే మా బాస్ ఢిల్లీకి రమ్మన్నారు. ఇప్పుడు నేను చెన్నై వ్యక్తికి ఇదే చెప్తే రీలొకేట్ అవ్వడానికి ఇష్టపడరు. IT ఉద్యోగులైతే ఆఫీసుకు రమ్మంటే BYE చెప్పేస్తార’న్నారు.

News February 12, 2025

బాదేపల్లి మార్కెట్‌లో నేటి ధరలు

image

జడ్చర్లలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేడు 3137 క్వింటాళ్లు వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాలుకు గరిష్ఠం ధర రూ.6881, కనిష్ఠ ధర రూ.4050 లభించింది. కందులు 130 క్వింటాలు అమ్మకానికి రాగా గరిష్ఠంగా ధర రూ.6926, కనిష్ఠం ధర రూ.5200 లభించింది. పత్తికి క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.6709 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా ధర రూ.2411 లభించింది.

error: Content is protected !!