News February 12, 2025
త్వరలో రాజ్యసభకు కమల్ హాసన్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739343504148_1199-normal-WIFI.webp)
మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధినేత, సినీ స్టార్ కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆయనతో పాటు మరొకరికీ అవకాశం ఉంటుందని తెలిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలప్పుడు అధికార DMKతో MNM పొత్తు పెట్టుకుంది. బదులుగా కమల్‌ను రాజ్యసభకు పంపిస్తామని CM MK స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని నేడు DMK మంత్రి ఒకరు, అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. MNM నుంచి మరొకరికీ అవకాశమిస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 12, 2025
PHOTO OF THE DAY
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739348547096_746-normal-WIFI.webp)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కొచ్చిలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో పవన్‌తో పాటు ఆయన కుమారుడు అకీరానందన్ కూడా ఉండటం విశేషం. తండ్రీకొడుకులు ఇద్దరూ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చి నమస్కరిస్తున్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఫొటో ఆఫ్ ది డే అంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.
News February 12, 2025
మొన్న 90 గంటల పని, భార్యనెంత సేపు చూస్తారు.. నేడు మరో వివాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739357084109_1199-normal-WIFI.webp)
వారానికి 90Hrs పని, భార్యను ఎంతసేపు చూస్తారన్న L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరో వివాదానికి తెరతీశారు. టెకీస్ సహా భారత శ్రామికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడరని, పరిశ్రమలకు సవాళ్లు సృష్టిస్తారని చెప్పారు. ‘నేను జాయిన్ కాగానే నాది చెన్నై అయితే మా బాస్ ఢిల్లీకి రమ్మన్నారు. ఇప్పుడు నేను చెన్నై వ్యక్తికి ఇదే చెప్తే రీలొకేట్ అవ్వడానికి ఇష్టపడరు. IT ఉద్యోగులైతే ఆఫీసుకు రమ్మంటే BYE చెప్పేస్తార’న్నారు.
News February 12, 2025
భారత్ భారీ స్కోర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739359473320_653-normal-WIFI.webp)
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. గిల్ సెంచరీ(112)తో అదరగొట్టగా శ్రేయస్ 78, కోహ్లీ 52, రాహుల్ 40 రన్స్‌తో రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. గత మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన కెప్టెన్ రోహిత్ ఈసారి ఒక్క పరుగుకే ఔట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 4, వుడ్ 2 వికెట్లతో సత్తా చాటారు.