News February 12, 2025

అక్రమం ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు: వరంగల్ సీపీ

image

ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు సన్నద్ధమాయ్యారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామ శివారులోని ఇసుక ర్యాంపులను పరిశీలించారు.

Similar News

News September 11, 2025

ములుగు జిల్లాలో 2,29,159 మంది ఓటర్లు

image

ములుగు జిల్లాలో MPTC, ZPTC ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఓటర్ తుది జాబితాను ప్రకటించినట్లు అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు తెలిపారు. జిల్లాలో 10 జడ్పీటీసీ, 83 ఎంపీటీసీ స్థానాలకు గాను 473 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 2,29,159 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు, ఇతరులు 22 మంది ఉన్నట్లు వెల్లడించారు.

News September 11, 2025

సంగారెడ్డి: తనిఖీలకు కలెక్టర్ ఆదేశాలు

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలు, గురుకులాలు, వసతి గృహాలను తనిఖీలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య బుధవారం ఆదేశాలు ఇచ్చారు. లింగంపల్లి గురుకుల పాఠశాల భవనం కూల్చివేత నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలను ఇచ్చినట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు వివరాలను ఎంఈవోలు తనిఖీలు చేసి వెంటనే ఇవ్వాలన్నారు.

News September 11, 2025

జగిత్యాల: CUET పరీక్ష ఫలితాల్లో విద్యార్థినుల ప్రతిభ

image

జగిత్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినులు సీయూఈటీ (CUET) పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. శ్వేత, ప్రత్యూష, స్రవంతి, ఇందు, దీప్తి నాయక్, ప్రవళిక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, స్థానికులు వారిని అభినందించారు.