News February 12, 2025

పెద్దపల్లిలో మందకొడిగా పత్తి కొనుగోళ్లు!

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పత్తి మార్కెట్‌లో కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. పత్తికి కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధర మాత్రమే అందుతోందని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం పత్తికి క్వింటాకు రూ.6,811 చొప్పున పలుకుతోంది.

Similar News

News February 12, 2025

HYDలో ఉరేసుకున్న తూ.గో యువకుడు

image

ఉప్పలగుప్తంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కొర్లపాటి శేషురావు (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో ఈ ఘటన మంగళవారం జరిగింది. అద్దెకుంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు. శేషురావు మృతదేహాన్ని ఉప్పలగుప్తం తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

News February 12, 2025

బాసర ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి

image

బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శెకావత్‌ను బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తలమానికం తెలంగాణలోని ఏకైక సరస్వతి దేవాలయం బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. వీరితో ఎంపీ గోడం నగేశ్ ఉన్నారు.

News February 12, 2025

సర్కారు బడిలో సార్ బిడ్డ..!

image

సర్కారు బడి బలోపేతం కోసం మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు ఈ టీచర్. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంకి చెందిన నర్సింగ్ నరేశ్ పాలకీడు ZPHS తెలుగు టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె నర్సింగ్ నేహాను కీతవారిగూడెం ZPHSలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీచర్‌ల కాంప్లెక్స్ మీటింగ్ కీతవారిగూడెంలో నిర్వహించగా ఈ విషయం తెలియడంతో HM సువర్ణ, టీచర్లు నరేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

error: Content is protected !!