News February 12, 2025
శెభాష్ పోలీస్.. నిమిషాల్లో ప్రాణం కాపాడారు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739342287593_746-normal-WIFI.webp)
AP: ఆర్థిక ఇబ్బందులతో కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్ చేయగా పోలీసులు అతణ్ని కాపాడి శెభాష్ అని అనిపించుకున్నారు. అయినవెల్లి CI భీమరాజుకు ఫిర్యాదు రావడంతో లొకేషన్ గుర్తించి అన్నవరంలో ఉన్న SI శ్రీహరికి సమాచారమిచ్చారు. వీడియో లాడ్జీలోనిదని గుర్తించి నగరంలోని లాడ్జీ ఓనర్లను అలర్ట్ చేశారు. ఉరేసుకునేముందు వారు తలుపు నెట్టి కాపాడారు. ఇదంతా 6 నిమిషాల్లోనే జరగడం విశేషం.
Similar News
News February 12, 2025
కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయి: మాజీ మంత్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739362984589_653-normal-WIFI.webp)
TG: తెలంగాణ, ఏపీని మద్యం మాఫియా నడిపిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రెండు రాష్ట్రాలు ఒప్పందంతో నడుస్తూ ఒకేసారి మద్యం ధరలు పెంచాయని అన్నారు. కొద్దిరోజుల్లో బ్రాందీ, విస్కీ రేట్లూ పెరుగుతాయని తెలిపారు. ధరలు ఎవరు పెంచుతున్నారో తమకు తెలుసని, త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
News February 12, 2025
‘స్పిరిట్’: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739362275920_746-normal-WIFI.webp)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ‘స్పిరిట్’ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కథను డైరెక్టర్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈక్రమంలో కొత్త/ ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న నటీనటులను తీసుకునేందుకు మేకర్స్ కాస్టింగ్ కాల్ ఇచ్చారు. దీంతో చిత్ర ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈలెక్కన అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
News February 12, 2025
ఈ ఏడాదే తల్లికి వందనం, బడ్జెట్‌లో నిధులు: సీఎం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739358701689_81-normal-WIFI.webp)
AP: ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలు, బడ్జెట్ కూర్పుపై మంత్రి పయ్యావుల, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని, బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమతూకంపైనా చర్చిస్తున్నారు.