News February 12, 2025
Stock Markets: షార్ప్ రికవరీతో హ్యాపీ.. హ్యాపీ..

దేశీయ స్టాక్‌మార్కెట్లలో షార్ప్ రికవరీ జరిగింది. బెంచ్‌మార్క్ సూచీలు రోజువారీ కనిష్ఠాల నుంచి బలంగా పుంజుకున్నాయి. ఆరంభంలో 200Pts నష్టపోయిన నిఫ్టీ ప్రస్తుతం 34 pts లాభంతో 23,108 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ -600 నుంచి +89కి చేరుకొని 76,377 వద్ద చలిస్తోంది. ఫైనాన్స్, మెటల్, బ్యాంకు, మీడియా రంగాలు ఇందుకు దన్నుగా నిలిచాయి. SBILIFE, BAJAJFINSV, HDFCLIFE, ULTRACEMCO, ADANIENT టాప్ గెయినర్స్.
Similar News
News November 8, 2025
ప్రతి ఆటంకాన్ని తొలగించే వ్రతం ఇదే..

సంకటహర గణపతి వ్రతం ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుందని పండితులు చెబుతారు. ఈ వ్రతం చేస్తే ఆర్థిక, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, సంతాన లేమి, విద్యవ్యాపారాల్లో వెనకబాటు తనం వంటి సమస్యలు పరిష్కారమవుతాయని అంటారు. ‘నర దృష్టి, శత్రు పీడల నుంచి ఈ వ్రతం రక్షణ కల్పిస్తుంది. వివాహం ఆలస్యం కావడం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవడం వంటి సమస్యలు కూడా తీరుతాయి. ఈ వ్రతాన్ని ఒకసారి చేసినా ఫలితం ఉంటుంది’ అని నమ్మకం.
News November 8, 2025
ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌ను ప్రారంభించిన చైనా

చైనా తమ మూడో విమాన వాహక యుద్ధ నౌక ఫుజియాన్‌ను రహస్యంగా ప్రారంభించింది. బుధవారం చైనాలోని సాన్యా పోర్టులో అధ్యక్షుడు జిన్ పింగ్ దీనిని ప్రారంభించినట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘జిన్‌హువా’ పేర్కొంది. కానీ, అధికారిక మీడియా మాత్రం ఫుజియాన్‌ను శుక్రవారం ప్రారంభించినట్లు పేర్కొంది. చైనా తీసుకొచ్చిన లియావోనింగ్(2012), షాన్‌డాంగ్(2019) కంటే ఇది పెద్దదని, దీని బరువు 80 వేల టన్నులని తెలుస్తోంది.
News November 8, 2025
పైలట్‌ను నిందించలేం: సుప్రీంకోర్టు

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా క్రాష్‌కి సంబంధించి పైలట్‌ను నిందిచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రమాదంలో చనిపోయిన మెయిన్ పైలట్ సుమిత్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. DGCA, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ‘ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. మీ కుమారుడిని ఎవరూ నిందిచలేరు. పైలట్ తప్పు వల్లే ప్రమాదం జరిగిందని దేశంలో ఎవరూ భావించడం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


