News February 12, 2025
కొత్తూరు: దర్గాను దర్శించుకున్న హీరో విశ్వక్ సేన్

షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను ప్రముఖ సినీ హీరో విశ్వక్‌సేన్ దర్శించుకున్నారు. త్వరలో విడుదల కానున్న తన సినిమా లైలా హిట్ కావాలని కుటుంబసభ్యులతో కలిసి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి దర్గాకు వస్తుండే వాడినని, ఈ మధ్యకాలంలో రాలేకపోయానన్నారు.
Similar News
News September 19, 2025
దుర్గ గుడి ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు ఈ సమయంలో కరెక్టేనా..?

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో కొత్తగా ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, సభ్యుల నియామకం, ఆలయ అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. వీరి మధ్య సమన్వయం లోపిస్తే భక్తులకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమ్మవారి దర్శనాలు, ఉత్సవాల నిర్వహణపై ఇరువురు ఎలా సమన్వయం చేసుకుంటారో చూడాలి.
News September 19, 2025
KNR: NOV నుంచి అంగన్వాడీ పిల్లలకు ‘బ్రేక్ ఫాస్ట్’

అంగన్వాడీల చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. NOV 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నుంచి ఈ ప్రోగ్రాంను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఇప్పటికే మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలందాయి. కాగా, ఉమ్మడి KNRలో 3,135 అంగన్వాడీలు ఉండగా, 74,550 మంది చిన్నారులు చదువుతున్నారు. మరోవైపు చిన్నారులకు, సిబ్బందికి 2జతల చొప్పున యూనిఫాంలను ప్రభుత్వం ఇవ్వనుంది.
News September 19, 2025
NLG: ప్రభుత్వ టీచర్లకు టెట్ టెన్షన్

ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వ టీచర్లుగా కనీసం ఐదేళ్ల సర్వీస్ ఉన్న వారంతా టెట్ ఉత్తీర్ణత కావాల్సిందే అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. ఒక నల్గొండ జిల్లాలోనే సుమారుగా 2 వేల మందికి పైగా టీచర్లకు టెట్ అర్హత లేదని సమాచారం. అర్హత సాధించని వారు తమ ఉద్యోగాలు వదులుకోవాలని తీర్పులో పేర్కొనడంతో ఉపాధ్యాయ లోకం గందరగోళంలో పడింది.