News February 12, 2025
జగన్ మద్యంతో ప్రజల ఆరోగ్యంపై ఎఫెక్ట్: మంత్రి రవీంద్ర
AP: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అనడం హస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ ఎమ్మెల్యేగా సభకు రావొచ్చని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. పార్టీ కార్యాలయంలో ప్రజల వినతులను ఆయన స్వీకరించారు. జగన్ తీసుకొచ్చిన మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పాడైందని విమర్శించారు. మరోవైపు బర్డ్ ఫ్లూపై నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
Similar News
News February 12, 2025
అమెరికాకు పయనమైన ప్రధాని మోదీ
ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరారు. యూఎస్‌లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ట్రంప్ ఆ దేశాధ్యక్షుడయ్యాక మోదీకి ఇదే తొలి పర్యటన. ఈ సందర్భంగా అక్కడి వ్యాపారవేత్తలు, భారత ప్రవాసుల్ని ఆయన కలవనున్నారు. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
News February 12, 2025
స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్?
TG: 42% బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే కేంద్రం ఆమోదం తెలుపుతుందా? లేదా? తెలిపినా ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్చి తర్వాతే స్థానిక ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.
News February 12, 2025
‘దిల్‌రూబా’ విడుదల వాయిదా
కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్‌రూబా’ విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ వాలంటైన్స్ డే సందర్భంగా FEB 14న రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని కిరణ్ తెలియజేస్తూ ‘కొంచెం లేట్‌గా వస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని చెప్పారు. కిరణ్ నటించిన ‘క’ హిట్ కావడంతో ఈ మూవీపైనా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.