News February 12, 2025

జేఈఈ మెయిన్స్‌లో గుండాల విద్యార్థుల ప్రతిభ

image

ఎన్.టి.ఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్-2025 తొలి సెషన్ ఫలితాల్లో మారుమూల గిరిజన ప్రాంతమైన గుండాల గురుకుల కళాశాలకు విద్యార్థులు ప్రతిభ చూపారు. విద్యార్థులు డి.నరసింహ-78%, ఎన్.దేవిప్రసాద్-72%, జి.మనోహర్-58%, బి సతీశ్ కుమార్-57%, బి.గణేశ్-45% ఉత్తమ పర్సంటైల్ సాధించారు. కాగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ వి.సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్  రామచంద్రరావు, అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 12, 2025

మందమర్రి PHCని సందర్శించిన DMHO

image

మందమర్రిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని గదులతో పాటు ఆరోగ్య కేంద్రం పరిధిలోనే ఉన్న క్వార్టర్లను వారం లోపల శుభ్రం చేయించాలని ఆదేశించారు.

News February 12, 2025

సిరిసిల్ల: గంజాయి సాగుచేస్తూ.. తాగుతున్న వ్యక్తుల అరెస్ట్

image

సిరిసిల్ల మండలం పెద్దూరు మెడికల్ కాలేజీ పక్కన 4 వ్యక్తులు గంజాయిని సాగుచేస్తూ.. తాగుతుండగా వారిని అరెస్ట్ రిమాండ్ తరలించామని CI కృష్ణ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దేద్రాడ్ ధలి, మాలే మాలిక్, ప్రణబ్ సింగ్, సాగర్ సర్కార్ అనే వ్యక్తులు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి వచ్చారు. పక్కనే ఉన్న స్థలంలో గంజాయి మొక్కలను సాగుచేస్తూ.. తాగుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుని 50G గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

News February 12, 2025

అమెరికాకు పయనమైన ప్రధాని మోదీ

image

ఫ్రాన్స్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరారు. యూఎస్‌లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ట్రంప్ ఆ దేశాధ్యక్షుడయ్యాక మోదీకి ఇదే తొలి పర్యటన. ఈ సందర్భంగా అక్కడి వ్యాపారవేత్తలు, భారత ప్రవాసుల్ని ఆయన కలవనున్నారు. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

error: Content is protected !!