News February 12, 2025

వసతి గృహాల రిపేర్స్‌కు ప్రపోజల్స్ పంపండి: తిరుపతి కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలలో మరమ్మతుల నిమిత్తం ప్రపోజల్స్ పంపించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.  

Similar News

News November 19, 2025

ములుగు: లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా?

image

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. హిడ్మా ఎన్కౌంటర్‌తో ఆయన పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది చూడాలి.

News November 19, 2025

ఉదయగిరి: బాలికపై యువకుడు లైంగిక దాడి

image

బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం దుత్తలూరు మండలంలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికకు కొద్ది నెలల క్రితం వింజమూరుకు చెందిన సాథిక్ అనే యువకుడికి పరిచయమయ్యాడు. ఈక్రమంలో బాలికను ఉదయగిరి దుర్గంపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడగా అస్వస్థతకు గురైంది. బాలికను హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అత్యాచారానికి గురైందని డాక్టర్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కేసు నమోదు చేశారు.

News November 19, 2025

నరసరావుపేట: కొండెక్కిన కోడిగుడ్డు ధరలు

image

కోడి గుడ్డు ధర అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఒకొక్క కోడిగుడ్డు రూ. 8 ధర పలుకుతోంది. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో కేక్‍లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. గత నెలలో ఒక్క కోడిగుడ్ల ధర రూ .7 వరకు ఉండేది. ఈ నెలలో రూ. 8 లు, డజను కోడిగుడ్లు రూ. 98 వరకు పలుకుతుంది. ఇటీవల కురిసిన వర్షాలు, డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవడమే ధర పెరగడానికి కారణమని వ్యాపారులు తెలిపారు.