News March 20, 2024
ప.గో: ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు యాప్
రాబోయే ఎన్నికల్లో అక్రమాలకు తావు లేకుండా ఓటింగ్ జరగాలని స్వీప్ నోడల్ ఆఫీసర్ తూతిక విశ్వనాథ్ అన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సి.విజిల్ యాప్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన ఐదు నిమిషాల్లోనే అధికారుల నుంచి స్పందన వస్తుందని అన్నారు. జిల్లా యంత్రంగం ఈ యాప్లో వచ్చిన ఫిర్యాదులకు సకాలంలో స్పందించి పరిష్కారం చూపుతారన్నారు.
Similar News
News January 15, 2025
ప.గో : పందేలలో పచ్చకాకిదే హవా
ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం కుక్కుట శాస్త్రం ఉందని పందెం రాయుళ్లు చెబుతున్నారు. మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు పందెంరాయుళ్లు చెబుతున్నారు. దీంతో కుక్కుట శాస్త్రంలో అవగాహన ఉన్నవాళ్లు మంగళవారం అంతా పచ్చకాకి కోడి పుంజుల హవానే కొనసాగిందని అంటున్నారు.
News January 14, 2025
కొయ్యలగూడెం: మేక మాంసానికి కేజీ కోడి మాంసం ఫ్రీ
కొయ్యలగూడెం పట్టణంలోని టీపీ గూడెం రోడ్డులోని ఓ మాంస కొట్టు వ్యాపారి భారీ ఆఫర్ ప్రకటించారు. రేపు కనుమ సందర్భంగా కిలో మేక మాంసం రూ.800కు కొనుగోలు చేసిన వారికి కిలో కోడి మాంసం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు.
News January 14, 2025
ప.గో జిల్లాలో కోసా రూ. 3 వేలు
రసవత్తర పోరులో ఓడి ప్రాణాలు కోల్పోయిన పందెం కోళ్లకు ఉభయగోదావరి జిల్లాల్లో భలే గిరాకీ ధర పలుకుతోంది. అయితే ఇక్కడ పందేనికి సిద్ధం చేసే కోళ్లకు ఓ ప్రత్యేకమైన ఫుడ్ మెనూ ఉంటుంది. దీంతో అవి మరణించాక రుచిగా ఉంటాయని మాంసం ప్రియులు చెబుతూ ఉంటారు. దీంతో పందెంలోని ఒక కోసా రూ. 2వేలు నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతోందని పలువురు అంటున్నారు.