News February 12, 2025

కొత్తూరు జెపి దర్గాను సందర్శించిన హీరో విశ్వక్ సేన్

image

ఉమ్మడి పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గాను సినీ హీరో విశ్వక్ సేన్ సందర్శించారు. త్వరలో విడుదల కానున్న మూవీ ‘లైలా’ విజయవంతం కావాలని కుటుంబ సభ్యులతో కలిసి దర్గాని దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి ఈ దర్గాకు వస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య కాలంలో కొద్దిగా బిజీగా ఉండి రాలేకపోయానని ఇప్పుడు లైలా విడుదల సందర్భంగా వచ్చినట్లు చెప్పారు.

Similar News

News February 12, 2025

23న జనసేన శాసనసభా పక్ష భేటీ

image

AP: ఫిబ్రవరి 23న జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం జరిగే ఈ భేటీలో పాల్గొనాలని ఎంపీలు, MLAలు, MLCలను పార్టీ ఆదేశించింది. 24వ తేదీన బడ్జెట్ సమావేశాలు పాల్గొననున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

News February 12, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లిరాజు తండ్రి పోలీస్ కంప్లైంట్

image

‘సంక్రాంతికి వస్తున్నాం’లో బుల్లి రాజు పాత్రతో బాలనటుడు రేవంత్ భీమాల అందర్నీ ఆకట్టుకున్నాడు. అతడి పేరిట కొన్ని ట్విటర్, ఇన్‌స్టా ఖాతాలు రాజకీయ విమర్శలు చేస్తుండటంతో అతడి తండ్రి శ్రీనివాసరావు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆయా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. రేవంత్ భీమాల అన్న పేరిట ఉన్న ఇన్‌స్టా మాత్రమే తమదని, రేవంత్‌ను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.

News February 12, 2025

కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికలకు 77 పోలింగ్ కేంద్రాలు

image

కృష్ణా – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఫిబ్రవరి 27న నిర్వహించే పోలింగ్‌కు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్‌లో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలాజీ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో Polling staff కీలక పాత్ర వహించాలన్నారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!