News February 12, 2025
BREAKING: అకౌంట్లో డబ్బుల జమ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738540471430_893-normal-WIFI.webp)
TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3 ఎకరాల వరకు సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6వేల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపింది. జనవరి 26న ఈ పథకం కింద ప్రభుత్వం నిధుల జమను ప్రారంభించింది. ఫిబ్రవరి 5న 17.03 లక్షల మందికి, ఫిబ్రవరి 10న 8.65 లక్షల మందికి విడతల వారీగా నిధులు జమ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News February 12, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లిరాజు తండ్రి పోలీస్ కంప్లైంట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739361930288_1045-normal-WIFI.webp)
‘సంక్రాంతికి వస్తున్నాం’లో బుల్లి రాజు పాత్రతో బాలనటుడు రేవంత్ భీమాల అందర్నీ ఆకట్టుకున్నాడు. అతడి పేరిట కొన్ని ట్విటర్, ఇన్‌స్టా ఖాతాలు రాజకీయ విమర్శలు చేస్తుండటంతో అతడి తండ్రి శ్రీనివాసరావు పోలీసుల్ని ఆశ్రయించారు. ఆయా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపారు. రేవంత్ భీమాల అన్న పేరిట ఉన్న ఇన్‌స్టా మాత్రమే తమదని, రేవంత్‌ను వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.
News February 12, 2025
భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737374916723_893-normal-WIFI.webp)
AP: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. భక్తులు వారికి నిర్దేశించిన సమయానికే క్యూలైన్లలోకి ప్రవేశించాలని సూచించింది. కొంతమంది భక్తులు కేటాయించిన సమయానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారని ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సోషల్ మీడియాలో TTDపై వారంతా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
News February 12, 2025
యోగా, జిమ్ చేస్తూ ఫిట్‌గా ఉన్నా హార్ట్ ఎటాక్ వచ్చింది: పరిణీత తండ్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739364083234_746-normal-WIFI.webp)
మధ్యప్రదేశ్‌కు చెందిన పరిణీత సంగీత్ వేడుకలో డాన్స్ చేస్తూ <<15414198>>గుండెపోటుతో<<>> చనిపోయిన ఘటనపై ఆమె తండ్రి సురేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వారం క్రితమే పరిణీత అన్ని టెస్టులు చేయించుకోగా నార్మల్ అని వచ్చింది. ఆమె చనిపోతుందనే ముందస్తు హెచ్చరిక, సంకేతం ఏదీ కనిపించలేదు. ఆమె ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టేది. రోజూ యోగా, జిమ్ చేస్తూ ఫిట్‌గా ఉండేది’ అని ఆయన చెప్పుకొచ్చారు.