News February 12, 2025
కామారెడ్డి: క్వింటాకు రూ.7550 చెల్లిస్తాం: మార్కోఫెడ్ జిల్లా మేనేజర్

కందులు క్వింటాకు మద్దతు ధర రూ.7,550 చెల్లిస్తామని మార్కోఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 56,189 ఎకరాల్లో కంది పంటను సాగు చేయడంతో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, బోర్లం, తాడ్వాయి, గాంధారి, పద్మాజీవాడి వద్ద కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 7, 2025
HYD: జంట జలాశయాలలో నీరు పుష్కలం.!

HYD నగర శివారు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని జలమండలి తెలిపింది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782.75 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుతం 1758 అడుగులు ఉన్నట్లు తెలిపారు. గత రికార్డుతో పోలిస్తే ఈసారి నీరు అధికంగా ఉందన్నారు.
News July 7, 2025
బల్దియా కౌన్సిల్ సమావేశానికి మంత్రి సురేఖ గైర్హాజరు

వరంగల్ మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా మంత్రి కౌన్సిల్ సమావేశానికి రాలేకపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా కౌన్సిల్ సమావేశంలో మేయర్ సుధారాణి అధికారికంగా బల్దియా బడ్జెట్‌ను ప్రకటించారు.
News July 7, 2025
HYD: హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే: కమిషనర్

హైడ్రా విజన్ అండ్ ఎజెండా అంశంపై ‘ప్రశ్నలు–జవాబులు’ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా పాల్గొన్నారు. హైడ్రా ఎప్పుడూ పేదల పక్షపాతిగానే ఉంటుందన్నారు. దేశ- విదేశాల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, హైడ్రాకు 169 పోస్టులు శాంక్షన్ కాగా, ప్రస్తుతం కేవలం 45 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇంకా రెండు వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ద్వారా సేవలందిస్తున్నామన్నారు.