News February 12, 2025

మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి

image

ఘట్‌కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్‌పేట, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

Similar News

News February 12, 2025

సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. అలర్ట్‌గా ఉండండి: ఎస్పీ

image

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బుధవారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని బైండోవర్ చేయాలని చెప్పారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, క్రికెట్ కిట్లు పంపిణీ చేయకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.

News February 12, 2025

కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక సూచన

image

TG: రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి వద్దే భద్రపరుచుకోవాలని చెప్పింది. అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, నిర్దిష్ట గడువు ఏమి లేదని పేర్కొంది. కాగా కొన్ని చోట్ల రేషన్ కార్డు దరఖాస్తులకు భారీగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.

News February 12, 2025

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెటితే చర్యలు: SP

image

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎటువంటి పోస్టులు పెట్టొద్దని చెప్పారు. తెలియని సమాచారాన్ని పోస్ట్ చేయడం, షేర్ చేయడం నేరమే అన్నారు.

error: Content is protected !!