News February 12, 2025
సిర్గాపూర్: క్యాన్సర్‌తో యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739353568846_20061001-normal-WIFI.webp)
సిర్గాపూర్ మండలం జమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని జీవులనాయక్ తండాకు చెందిన యువరైతు వడిత్య శ్రీనివాస్(29) క్యాన్సర్ వ్యాధితో మృతి చెందాడు. యువకుడు గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బుధవారం ఉదయం శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో మరణించినట్లు చెప్పారు. కాగా, మృతుడికి ఏడాది కిందటే పెళ్లైనట్లు సమాచారం. యువకుడి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 12, 2025
రామగుండం: వారం వ్యవధిలో తనువు చాలించిన భార్యాభర్తలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739377934377_50226861-normal-WIFI.webp)
తనువు ఆ తర్వాత మనువు తో కలిసిన ఆ బంధం కట్టే కాలే వరకు కొనసాగింది. 4 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు తనువు చాలించిన సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. స్థానిక బాపూజీ నగర్కు చెందిన ఆకునూరి లక్ష్మి ఈనెల 2న మరణించగా 4 రోజుల వ్యవధిలో భర్త ఆకునూరి దుర్గయ్య తనువు చాలించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన కుటుంబం లో విషాదాన్ని మిగిల్చింది.
News February 12, 2025
మన్యంకొండకు పోటెత్తిన భక్త జనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739368513711_60392612-normal-WIFI.webp)
పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లానుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అర్ధరాత్రి జరిగే (తెరు) రథోత్సవాన్ని వీక్షించడానికి భక్తజనం ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కాలినడకన కదలి రావడం జరిగింది. గోవిందా.. హరి.. గోవిందా అంటూ గోవిందా నామాలతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
News February 12, 2025
ఎల్లారెడ్డి: ప్రణాళికతో చదివితే ఉత్తీర్ణత సాధించవచ్చు: DEO
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355938562_50226745-normal-WIFI.webp)
ప్రతి విద్యార్థి ప్రణాళికతో చదివితే పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించవచ్చునని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థి జీవితంలో 10వ తరగతి తొలి మెట్టుగా భావించాలన్నారు.