News February 12, 2025
భారత్ భారీ స్కోర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739359473320_653-normal-WIFI.webp)
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. గిల్ సెంచరీ(112)తో అదరగొట్టగా శ్రేయస్ 78, కోహ్లీ 52, రాహుల్ 40 రన్స్‌తో రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. గత మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన కెప్టెన్ రోహిత్ ఈసారి ఒక్క పరుగుకే ఔట్ అవ్వడం అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ 4, వుడ్ 2 వికెట్లతో సత్తా చాటారు.
Similar News
News February 13, 2025
పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739382892136_893-normal-WIFI.webp)
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు US అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్, AI, ఎనర్జీ, పవర్ ఆఫ్ డాలర్‌తో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల చరిత్ర, బలాలపై మాట్లాడుకున్నామని, త్వరలో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణనష్టాన్ని ఆపాలనుకుంటున్నామని చెప్పారు. త్వరలో ఒకరి దేశంలో మరొకరు సందర్శిస్తామన్నారు.
News February 13, 2025
వన్డేల్లో పాకిస్థాన్ రికార్డు ఛేజింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739381549894_893-normal-WIFI.webp)
పాక్-న్యూజిలాండ్-సౌతాఫ్రికా వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే హైయెస్ట్ ఛేజింగ్. ఆ జట్టు బ్యాటర్లలో సల్మాన్ అఘా (134), కెప్టెన్ రిజ్వాన్ (122*) సెంచరీలతో రాణించారు. అంతకుముందు SA బ్యాటర్లలో బావుమా 82, మాథ్యూ బ్రీట్జ్కే 83, క్లాసెన్ 87 పరుగులు చేశారు.
News February 13, 2025
విజయసాయి రెడ్డి స్థానంలో కన్నబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739380655940_81-normal-WIFI.webp)
AP: వైసీపీలో పలు నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో ఈ స్థానంలో విజయసాయి రెడ్డి ఉండేవారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.