News February 12, 2025

PHOTO OF THE DAY

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు కొచ్చిలోని అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో పవన్‌తో పాటు ఆయన కుమారుడు అకీరానందన్ కూడా ఉండటం విశేషం. తండ్రీకొడుకులు ఇద్దరూ సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చి నమస్కరిస్తున్న ఫొటో నెట్టింట వైరలవుతోంది. ఫొటో ఆఫ్ ది డే అంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు.

Similar News

News February 13, 2025

పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు US అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్, AI, ఎనర్జీ, పవర్ ఆఫ్ డాలర్‌తో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల చరిత్ర, బలాలపై మాట్లాడుకున్నామని, త్వరలో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణనష్టాన్ని ఆపాలనుకుంటున్నామని చెప్పారు. త్వరలో ఒకరి దేశంలో మరొకరు సందర్శిస్తామన్నారు.

News February 13, 2025

వన్డేల్లో పాకిస్థాన్ రికార్డు ఛేజింగ్

image

పాక్-న్యూజిలాండ్-సౌతాఫ్రికా వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ విజయం సాధించింది. 353 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే హైయెస్ట్ ఛేజింగ్. ఆ జట్టు బ్యాటర్లలో సల్మాన్ అఘా (134), కెప్టెన్ రిజ్వాన్ (122*) సెంచరీలతో రాణించారు. అంతకుముందు SA బ్యాటర్లలో బావుమా 82, మాథ్యూ బ్రీట్జ్కే 83, క్లాసెన్ 87 పరుగులు చేశారు.

News February 13, 2025

విజయసాయి రెడ్డి స్థానంలో కన్నబాబు

image

AP: వైసీపీలో పలు నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో ఈ స్థానంలో విజయసాయి రెడ్డి ఉండేవారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

error: Content is protected !!