News February 12, 2025
మెదక్: చెరువులో పడి 6ఏళ్ల చిన్నారి మృతి

మెదక్‌లోని తూప్రాన్ పెద్ద చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాంద్ పాషా, పర్వీన్ కుమార్తె జుబేరియా(6) బుధవారం ఉదయం తల్లితో కలిసి పెద్ద చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా మెట్లపై ఆడుకుంటున్న జుబేరియా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 3, 2026
హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంటోంది!

హోలీ పండుగ, గ్రహణం ఉండటంతో నగరంలో రోడ్లు, బస్సులు వెలవెలబోయాయి. సాధారణంగా రద్దీగా ఉండే ప్రధాన రహదారులు ఖాళీగా కనిపించాయి. ప్రజలు ఇళ్ల వద్దే కుటుంబాలతో పండుగ జరుపుకోవడంతో బయట రాకపోకలు తగ్గాయి. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు బస్సుల్లో ప్రయాణికులు లేక సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. రంగుల సందడి కాలనీలకే పరిమితమైంది. బండ్ల పొగ లేక నగరం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది.

స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ దొరికితే..: CM

TG: మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులు చెల్లించాలని సీఎం రేవంత్ కలెక్టర్లను ఆదేశించారు. పిల్లలకు పోషకాహారం అందాలని, అందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్, ఈ-సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సైకాలజిస్టులను నియమించుకోవాలని సూచించారు.