News February 12, 2025

తిరుపతిలో దారుణ హత్య.. నిందితుడు అరెస్టు

image

తిరుపతి శ్రీనివాసం వద్ద జరిగిన అంకయ్య (30) హత్యకు సంబంధించి నిందితుడిని ఈస్ట్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పని వద్ద జరిగిన గొడవలో అంకయ్యను బలమైన రాడ్డుతో కొట్టి సతీశ్ పారిపోయాడు. అంకయ్యను మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 8న మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు.

Similar News

News January 15, 2026

ప్రెగ్నెన్సీ రావాలంటే వాటికి దూరంగా ఉండండి

image

చాలా మంది అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు పిల్స్‌ వాడుతుంటారు. కానీ ఇవి తరువాతి కాలంలోనూ ప్రెగ్నెన్సీ రాకుండా నిరోధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేయడానికి కనీసం రెండేళ్ల ముందు నుంచి, అలా వీలుకాకపోతే కనీసం 6 నెలలు ముందు నుంచి గర్భనిరోధక మాత్రలు వాడకపోవడం మంచిది. వీటితో పాటు దంపతులు ఆల్కహాల్‌, పొగాకు ఉత్పత్తుల్ని మానేయాలని సూచిస్తున్నారు.

News January 15, 2026

ఐఐటీ రూర్కీలో నాన్ టీచింగ్ పోస్టులు

image

<>ఐఐటీ<<>> రూర్కీ 9 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంటెక్/ఎంసీఏ, PhD, PG, MD/MS, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు మాజీ ఆర్మీ/నేవీ/IAF అధికారులు, మాజీ DSP అధికారులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iitr.ac.in

News January 15, 2026

సంక్రాంతి: నువ్వుల లడ్డూ తిన్నారా?

image

సూర్యుడు తన కుమారుడైన శనిదేవుని ఇంటికి వెళ్లే రోజే సంక్రాంతి. శనిదేవుడు నల్ల నువ్వులతో తండ్రిని పూజించడంతో వారి మధ్య వైరం తొలగిపోయింది. అందుకే నేడు నువ్వులు తినాలని పండితులు, పెద్దలు చెబుతారు. దీనివల్ల శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. శాస్త్రీయంగా చూసినా చలికాలంలో వాటిని తింటే అనేక లాభాలున్నాయి. రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే పండక్కి నువ్వుల లడ్డూలు చేస్తారు. మరి మీరు తిన్నారా? COMMENT