News February 12, 2025
కొడంగల్: బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్

దుద్యాల మండలంలోని పోలేపల్లి శ్రీరేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 21న ప్రధాన ఘట్టం సిడె కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారని ఆలయ మేనేజర్ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ జయరాములు, నాయకులు మెరుగు వెంకటయ్య, సీసీ వెంకటయ్యగౌడ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 3, 2026
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో పరేడ్

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఈరోజు పరేడ్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరేడ్‌కు హాజరై గౌరవ వందనం స్వీకరించి పరిశీలించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం అవసరమని సిబ్బందికి సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.
News January 3, 2026
NGKL జిల్లాలో యూరియా నిల్వలు ఇలా..!

నాగర్ కర్నూల్ జిల్లాలో జిల్లాలో 39,667 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. అచ్చంపేటలో 1,395, అమ్రాబాద్‌లో 228, బల్మూర్ 919, బిజినేపల్లి 2,733, చారకొండ 1,708, కల్వకుర్తి 8,366, కోడేరు 1,400, కొల్లాపూర్ 6,041, నాగర్ కర్నూల్ 2,328, వంగూరు 882, పదర 313, పెద్దకొత్తపల్లి 2,648, పెంట్లవెల్లి 1,862, తెలకపల్లి 2,250 ఉన్నట్లు తెలిపారు.
News January 3, 2026
వరంగల్: నిధులున్నా వాడుకోలేని దుస్థితి!

గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో నిధులు లేక, చాలా ప్రాంతాల్లో పనులు చేయట్లేదు. గ్రేటర్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.958 కోట్లను స్మార్ట్ సిటీ పథకం కింద ప్రతిపాదించి రూ.779 కోట్లను విడుదల చేశారు. అధికారుల అలసత్వంతో నిర్ణీత గడువులోగా DPRలు సమర్పించక పోవడంతో మరో రూ.179కోట్ల నిధులను వాడుకోలేని పరిస్థితి. స్మార్ట్ సిటీ పనులకు మరో 28 రోజులే గడువు ఉండగా, మరో రూ.15 కోట్ల పనులు పెండింగ్ ఉన్నాయి.


