News February 12, 2025

రోజుకు 30 నిమిషాలు ఇలా చేస్తే..!

image

ప్రతిరోజూ 10వేల అడుగులు వేయడం వీలుకాని వారు కనీసం ఆపకుండా 30 నిమిషాలు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. ‘అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అకాల మరణం నుంచి తక్కువ ప్రమాదం ఉంటుంది’ అని తెలిపారు. అయితే, నెమ్మదిగా నడవొద్దని, కాలక్రమేణా వేగాన్ని పెంచాలని సూచిస్తున్నారు. ఇది శరీర జీవక్రియ, శ్వాసకోశ, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Similar News

News December 27, 2025

జనరేషన్ బీటా గురించి తెలుసా?

image

2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 వరకు పుట్టే పిల్లలందరినీ ‘జనరేషన్ బీటా’గా పిలుస్తారు. ఈ తరం పూర్తిగా AI ప్రపంచంలో పెరగనుంది. భారత్‌లో మొదటి బీటా బేబీ మిజోరంలో పుట్టింది. ఇలా జనరేషన్స్​కు పేర్లు పెట్టడం 1901లో ప్రారంభమైంది. జనరేషన్ బీటాకు ముందు జనరేషన్ X​ (1965-80), జనరేషన్ Y లేదా మిలీనియల్స్​(1981-1996), జనరేషన్ Z​ (1997-2009), జనరేషన్ ఆల్ఫా (2010-2024)లు ఉన్నాయి. ఇంతకీ మీరు ఏ జనరేషన్‌?

News December 27, 2025

పబ్లిక్ ప్లేస్‌లో పావురాలకు మేత వేస్తున్నారా?

image

చాలామంది రోడ్లమీద, పార్కుల్లో పావురాలకు మేత వేస్తూ ఉంటారు. వాటి వల్ల అనారోగ్య <<15060184>>సమస్యలు<<>> వస్తాయని చెప్పినా లెక్కచేయరు. అయితే అలా చేసిన ఓ వ్యాపారికి ముంబై కోర్టు రూ.5వేలు ఫైన్ వేసింది. అతను చేసిన పనిని హ్యూమన్ లైఫ్, హెల్త్‌కి ముప్పుగా, ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ చేసే చర్యగా పేర్కొంది. పావురాలతో మనకు ఎంత ప్రమాదం పొంచి ఉందో ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News December 27, 2025

ఇంటర్వ్యూతో NAARMలో ఉద్యోగాలు

image

<>HYD<<>>లోని ICAR-నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్(NAARM) 5 పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది. అర్హతగల వారు DEC 29, 30, JAN 5, 6 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PhD, MSc( అగ్రికల్చర్), ME, MTech, బీటెక్, డిగ్రీ (మాస్ కమ్యూనికేషన్, జర్నలిజమ్, ఫైన్ ఆర్ట్స్), MCA, PG( అగ్రికల్చర్ ఎకనామిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://naarm.org.in