News February 12, 2025

వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం

image

TG: వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి(మ) నాగవరం శివారులో రెండెకరాల్లో టవర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.22 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఐటీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Similar News

News February 13, 2025

HEADLINES TODAY

image

AP: వైద్య ఖర్చులు తగ్గాలి: CM చంద్రబాబు
AP: దక్షిణ భారత ఆలయాల పర్యటన ప్రారంభించిన Dy CM పవన్
TG: కులగణనలో పాల్గొననివారికి మరో అవకాశం: భట్టి
TG: బీసీలకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి: KTR
☞ ముగిసిన PM ఫ్రాన్స్ పర్యటన..USకి పయనం
☞ ప్రభుత్వాలు ఉచితాలతో ప్రజల్ని బద్ధకస్తుల్ని చేస్తున్నాయి: సుప్రీం కోర్టు
☞ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

News February 13, 2025

IPL.. RCB ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

image

RCB ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి. ఆ జట్టు కెప్టెన్ ఎవరో రేపు తేలిపోనుంది. గురువారం ఉ.11.30 గంటలకు ఆ జట్టు తమ కెప్టెన్ పేరును ప్రకటించనుంది. గత సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన డూప్లిసెస్‌ను జట్టు రిలీజ్ చేయడంతో తదుపరి కెప్టెన్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి కోహ్లీనే కెప్టెన్‌గా ప్రకటిస్తారని అందరిలోనూ అంచనాలున్నాయి. విరాట్ కాకుంటే కృనాల్ పాండ్య, భువనేశ్వర్, జితేశ్ శర్మ‌లు రేసులో ఉన్నారు.

News February 13, 2025

పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడిన ట్రంప్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు US అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్, AI, ఎనర్జీ, పవర్ ఆఫ్ డాలర్‌తో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరు దేశాల చరిత్ర, బలాలపై మాట్లాడుకున్నామని, త్వరలో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణనష్టాన్ని ఆపాలనుకుంటున్నామని చెప్పారు. త్వరలో ఒకరి దేశంలో మరొకరు సందర్శిస్తామన్నారు.

error: Content is protected !!