News February 12, 2025
సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించండి.. డీకే అరుణ విజ్ఞప్తి

గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. ఈ విషయమై బుధవారం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఇతర ఎస్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Similar News
News December 30, 2025
రాజన్న కోడెలను రక్షించుకుందాం: ఇంఛార్జ్ కలెక్టర్

ప్లాస్టిక్ వినియోగం తగ్గించి రాజన్న కోడెలను రక్షించుకుందామని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. జాతర సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగంతో కోడెల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, స్థానిక వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు సహకరించాలని కోరారు. సంబంధిత అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి ప్లాస్టిక్ విక్రయాన్ని అరికట్టాలన్నారు.
News December 30, 2025
అందరికీ AI: ప్రభుత్వం సరికొత్త ప్లాన్!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేవలం కొందరికే పరిమితం కాకుండా, సామాన్యులకూ అందుబాటులోకి రావాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ‘AI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’పై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. నగరాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోని వారూ లోకల్ భాషల్లో AI టూల్స్ తయారు చేసుకునేలా.. కంప్యూటింగ్ పవర్, డేటాను అందరికీ షేర్ చేయడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.
News December 30, 2025
KNR: ‘మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు’

ఫిబ్రవరి 14, 15, 16వ తేదీలో వేములవాడలో జరుగనున్న మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. జాతర సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర సందర్భంగా 8 మంది డీఎస్పీలు, 38 మంది సీఐలు, 119 మంది ఎస్సైలు, 158 ఏఎస్సైలు, 388 కానిస్టేబుళ్లు, హోమ్ గార్డ్స్‌తో కలిపి మొత్తం 1300 మందికి పైగా పోలీసులు మూడు రోజులు బందోబస్తు నిర్వహిస్తారని వెల్లడించారు.


