News February 12, 2025

15న అమరచింతకు జాన్ వెస్లీ రాక

image

అమరచింతకు ఈనెల 15న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వస్తున్నట్లు ఆత్మకూరు సీపీఐ(ఏం) మండల కార్యదర్శి ఎస్ రాజు పేర్కొన్నారు. అమరచింతలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అభినందన సభ ఉంటుందన్నారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అమరచింతకు చెందిన జాన్ వెస్లీ నూతన సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

Similar News

News February 13, 2025

మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది: ఎర్రబెల్లి

image

రానున్న ఆరు నెలల్లో కాంగ్రెస్ కూలిపోతుందని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పెద్దవంగర మండలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ బూటకపు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. 

News February 13, 2025

పల్వంచ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

పల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. లింగంపేట్ మండలానికి చెందిన కుర్ర వెంకట్(25) అనే యువకుడు 3 నెలల క్రితం చెరుకు కొట్టడానికి వచ్చి గుడిసె వేసుకున్నాడు. కాగా ప్రమాదవశాత్తు గుడిసెకు విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ షాక్‌తో వెంకటి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు శవాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఏస్ఐ అనిల్ తెలిపారు.

News February 13, 2025

సంగారెడ్డి: 15న బంజారా కమ్యూనిటీ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

image

ఈనెల 15న సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని, వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న బంజారా కమ్యూనిటీ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు చేశారు.

error: Content is protected !!