News February 12, 2025
వనపర్తి జిల్లాకు ఐటీ టవర్ మంజూరు: చిన్నారెడ్డి

వనపర్తి జిల్లాకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మంజూరైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయ మీడియా సెంటర్లో విలేకరుల సమావేశంలో జి. చిన్నారెడ్డి ఈ విషయం వెల్లడించారు. ఐటీ టవర్ నిర్మాణం కోసం రూ.22 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఐ టీ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.
Similar News
News December 24, 2025
చిత్తూరు జిల్లాలో ఇతగాడితో జాగ్రత్త..!

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన కె.చంద్రబాబు(33)పై ప్రభుత్వం PD యాక్ట్ ప్రయోగించింది. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అమాయకులను మోసం చేస్తూ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. రెండేళ్లలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రజాశాంతి భద్రతలకు ముప్పుగా మారినట్లు అడ్వయిజరీ బోర్డు తేల్చింది. 12నెలలు అతడిపై పీడీ యాక్ట్ అమలు కానుంది.
News December 24, 2025
ఇయర్ బడ్స్‌ను క్లీన్ చేస్తున్నారా? లేదంటే..

రోజూ వాడే ఇయర్ బడ్స్ చూడటానికి క్లీన్‌గానే అనిపిస్తాయి. కానీ వాటిలో కిచెన్ సింక్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. వాటిని సరిగా క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్లు, రాషెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్ వాక్స్ పేరుకుపోయి వినికిడి సమస్యలు రావచ్చు. నెలకు ఒక్కసారైనా సాఫ్ట్ క్లాత్ లేదా టూత్ బ్రష్‌తో బడ్స్‌ను తుడవాలి. నీళ్లతో కడగొద్దు. అవి శుభ్రంగా ఉంటే హెల్త్ సేఫ్‌గా ఉండటంతో పాటు డివైజ్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.
News December 24, 2025
పల్లవ రాణి కానుక ‘భోగ శ్రీనివాస మూర్తి’

క్రీ.శ.614లో శ్రీవారి పరమ భక్తురాలైన పల్లవ మహారాణి శ్యామమ్మ(కడవన్ పెరుందేవి) ఆయనకు ప్రతిరూపంగా ‘మనవాల పెరుమాళ్’ అనే వెండి భోగ శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని సమర్పించారు. ఏటా పెరటాసి(కన్యామాసం) బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించే సంప్రదాయాన్ని ఆమె ప్రారంభించారు. గర్భాలయంలోని మూలవిరాట్టు తరపున నిత్య కైంకర్యాలన్నీ నేటికీ ఈ భోగ శ్రీనివాస మూర్తికే నిర్వహిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>


