News February 12, 2025

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి: Dy DMHO

image

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని డిప్యూటీ DMHO డాక్టర్ విజయకుమార్ తెలిపారు. దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని Dy DMHO సందర్శించి, ఫార్మసీ స్టోర్, ల్యాబ్, ఆయుష్ క్లినిక్లను పరిశీలించారు. గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలపై సమీక్షించారు. ఇందులో అశోక్ రెడ్డి, మాధవరెడ్డి, డాక్టర్ మహేంద్ర, రవీందర్, పి.శ్రీకాంత్, రాజేశ్వరి, పాల్గొన్నారు.

Similar News

News February 13, 2025

NRPT: ‘విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు’

image

వేసవికాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలని విద్యుత్ శాఖ జిల్లా పర్యవేక్షణ అధికారి ప్రభాకర్ అన్నారు. బుధవారం నారాయణపేట డీఈ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యత్ సరఫరాలో అంతరాయం రాకుండా ముందస్తుగా తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అవసరమైన సామాగ్రిని అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు.

News February 13, 2025

దోమకొండ: గుండెపోటుతో యువకుడి మృతి

image

దోమకొండ మండలం అంబర్ పేట్ గ్రామానికి చెందిన నీల అరవింద్(19) అనే యువకుడు బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. అరవింద్ తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా అరవింద్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చురుకుగా ఉంటారని స్థానికులు తెలిపారు. యువకుడి మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

News February 13, 2025

మొగడంపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

image

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మొగడంపల్లి మండలం చిరాగ్‌పల్లి SI రాజేందర్ రెడ్డి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 115 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆర్టీఏ చెకోపోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకొని స్వాధీనం చేసుకున్నామన్నారు. శివానంద్, వెంకట్, పాండు, ఓనర్ సిద్ధు, డ్రైవర్ సంగమేష్‌లపై కేసు నమోదు చేశామన్నారు.

error: Content is protected !!