News February 12, 2025

కర్ణాటకలో తొలి కారుణ్య మరణం ఈవిడదే!

image

ఎప్పటికీ నయమవ్వని వ్యాధులతో బాధపడుతోన్న వారికి <<15326754>>కారుణ్య మరణం<<>> పొందే హక్కు కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో తొలి మరణం 85 ఏళ్ల రిటైర్డ్ టీచర్ కరిబసమ్మది కానుంది. ఆమె మూడు దశాబ్దాలకు పైగా స్లిప్డ్ డిస్క్ కారణంగా దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారు. క్యాన్సర్‌ బారిన కూడా పడి నరకం అనుభవిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో గౌరవంగా మరణించే హక్కును ఈమె పొందారు.

Similar News

News November 8, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్టులు

image

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 17 కాంట్రాక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్‌తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్లకు నెలకు రూ.70వేలు, జూనియర్ మేనేజర్‌లకు రూ.30వేల జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/

News November 8, 2025

ALERT: పశువులకు ఈ టీకా వేయించారా?

image

తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారు. ఈ నెల 14 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. ఈ టీకాను పశువులకు వేయించడంలో పాడి రైతులు నిర్లక్ష్యం చేయొద్దు.✍️ రోజూ సాగు, పాడి సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

News November 8, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

image

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.